Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు బిజీ… అసలు కారణం అదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్ 'వారణాసి'లో నటిస్తూ తీరిక లేకుండా ఉన్నారు. ఇటీవల ఈ చిత్రీకరణకు తాత్కాలిక విరామం లభించడంతో మహేష్ విదేశాలకు వెళ్లడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆయన ఈ ట్రిప్ సినిమా పనుల కోసమా లేక వ్యక్తిగత విహారయాత్రకా అన్న సందేహాలకు ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా సమాధానం ఇచ్చారు.
వివరాలు
అడవులు నేపథ్యంలో సీన్స్..
ప్రస్తుతం మహేష్ బాబు బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో గడుపుతున్నారు. అక్కడి సహజ సౌందర్య మధ్య ట్రెక్కింగ్ చేస్తూ, తన రాబోయే చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల కోసం శారీరకంగా సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ హ్యారితో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'గుంటూరు కారం' విడుదల అనంతరం కూడా మహేష్ ఇదే ప్రదేశంలో ట్రెక్కింగ్ చేసిన విషయం గుర్తించదగినది. రాజమౌళి-మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' ఒక అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, అడవుల నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది.
వివరాలు
2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు
తదుపరి షూటింగ్ షెడ్యూల్‌ను అంటార్కిటికాలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అక్కడి తీవ్రమైన చలి వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు, క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనేందుకు అవసరమైన ఫిట్‌నెస్ సాధించడానికే మహేష్ ఈ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, రాజమౌళి ప్రత్యేక శైలిలో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. 'వారణాసి' చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.