Jaanvi Swarup: కృష్ణ కుటుంబం నుంచి మరో స్టార్ కిడ్స్ ఎంట్రీ.. హీరోయిన్'గా మహేష్ బాబు మేనకోడలు ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి, స్టార్ హీరోగా సుస్థిర స్థానం సంపాదించిన మహేష్ బాబును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న సినిమా ద్వారా గ్లోబల్ స్టార్‌గా మరింత ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. సరిగ్గా ఇదేసమయంలో ఆయన మేనకోడలు హీరోయిన్గా ఎంట్రీస్తోంది మహేష్ బాబు మేనకోడలు,అంటే మంజుల ఘట్టమనేని-స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్,సినీ రంగంలో హీరోయిన్‌గా ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. జాన్వీ నటనతో పాటు పెయింటింగ్,డాన్స్,ఫిట్‌నెస్, డ్రైవింగ్ వంటి అనేక విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. నటిగా మారకముందే ఆమె ఒక జ్యువెలరీ ప్రచారంలో కనిపించి,ఆ తర్వాత పలువురు జాతీయ స్థాయి బ్రాండ్లు,దర్శకులు ఆమెను సంప్రదించారని సమాచారం.
వివరాలు
కృష్ణ అభిమానులు బాధపడతారనే కారణంతో..
నిజానికి పదేళ్ల వయసులోనే జాన్వీ తెరపై కనిపించింది.ఆమె తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాలో చిన్న పాత్రలో నటించి తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె నటన,నృత్యం తదితర రంగాల్లో నిరంతరం అభ్యాసం చేస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకుంది. గతంలో మంజుల ఘట్టమనేని బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించాల్సి ఉన్నప్పటికీ,అప్పట్లో కృష్ణ అభిమానులు బాధపడతారనే కారణంతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఇప్పుడు ఆమె కుమార్తె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండటంతో మంజుల ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఒకప్పుడు"నీవు హీరోయిన్‌గా ఎందుకు?"అని ప్రశ్నించినవారే ఇప్పుడు"నీ కుమార్తె సినిమాల్లో రావాలి"అని ప్రోత్సహిస్తున్నారని ఆమె చెబుతున్నారు. తన కుమార్తె చిరునవ్వే తన ప్రార్థనలకు సమాధానం అని మంజుల ఘట్టమనేని ఆనందంగా పేర్కొన్నారు.