LOADING...
Varanasi: ఫుల్ స్పీడ్‌లో మహేష్-రాజమౌళి మూవీ.. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడంటే?
ఫుల్ స్పీడ్‌లో మహేష్-రాజమౌళి మూవీ.. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడంటే?

Varanasi: ఫుల్ స్పీడ్‌లో మహేష్-రాజమౌళి మూవీ.. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'వారణాసి'. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ-మైథలాజికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. మందాకిని పాత్రలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, కుంభ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. తాజా అప్‌డేట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో షూటింగ్‌ను ఫాస్ట్ ట్రాక్‌లో కొనసాగిస్తున్నారని సమాచారం.

detailds

70శాతం షూటింగ్ కంప్లీట్

ఇప్పటికే ఆఫ్రికా, జార్జియా వంటి దేశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్రబృందం, తదుపరి దశ కోసం వారణాసి (కాశీ)కి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.కాశీలో షూటింగ్‌ను కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయిందని సమాచారం. మిగిలిన భాగాన్ని అంటార్కటికా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి విభిన్న లొకేషన్లలో చిత్రీకరించేందుకు యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

details

అత్యధిక దేశాల్లో విడుదలైన భారతీయ చిత్రంగా ఇది రికార్డు

ఈ చిత్రంలో మహేశ్‌బాబు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. ముఖ్యంగా లాంగ్ హెయిర్, గడ్డంతో రగ్గ్డ్ లుక్‌లో ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం. కీరవాణి అందిస్తున్నారు. అంతేకాకుండా, 'వారణాసి' సినిమాను 120కిపైగా దేశాల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అత్యధిక దేశాల్లో విడుదలైన భారతీయ చిత్రంగా ఇది రికార్డు సృష్టించే అవకాశముంది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి షూటింగ్ లొకేషన్లు, స్టార్ కాస్ట్ మొత్తం క‌లిసి ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తుతున్నాయి. 'వారణాసి' భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే చిట‌త్రంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Advertisement