LOADING...
Rashmika-Mysa: 'మైసా' షూటింగ్ అప్‌డేట్ సూపర్.. యాక్షన్ మోడ్‌లో రష్మిక మందన్న
'మైసా' షూటింగ్ అప్‌డేట్ సూపర్.. యాక్షన్ మోడ్‌లో రష్మిక మందన్న

Rashmika-Mysa: 'మైసా' షూటింగ్ అప్‌డేట్ సూపర్.. యాక్షన్ మోడ్‌లో రష్మిక మందన్న

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

'పుష్ప'లో శ్రీవల్లిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక మందన్న ఇప్పుడు తనలోని యాక్షన్ యాంగిల్‌ను చూపించేందుకు సిద్ధమవుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మైసా' చిత్రంలో ఆమె గోండు గిరిజన యువతిగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం రష్మిక ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటూ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అత్యంత సహజంగా, ప్రేక్షకులకు గూస్‌బంప్స్ వచ్చేలా ఉండాలని దర్శకుడు ప్లాన్ చేశారు. అందుకోసం రష్మిక బ్యాంకాక్ వెళ్లి ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యుద్ధ విద్యలను నేర్చుకుంది. ప్రస్తుతం కేరళలోని దట్టమైన అడవుల్లో ఈ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఆధ్వర్యంలో సుమారు 15 రోజుల పాటు భారీ యాక్షన్ షెడ్యూల్ కొనసాగుతోంది.

వివరాలు

కేరళలో షెడ్యూల్ చిత్రీకరణ

రష్మిక మేకోవర్ గిరిజన యువతిగా చాలా రా, ఇంటెన్స్‌గా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌లో రష్మిక డూప్‌లపై ఆధారపడకుండా స్వయంగా నటిస్తోందని తెలుస్తోంది. ఈసన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి.అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటి వరకు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాల్లో ఎక్కువగా కనిపించిన రష్మిక, 'మైసా'తో తన నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతోంది. కేరళ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్న ఈ గాఢమైన సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. 'పుష్ప 2' తర్వాత రష్మిక నుంచి రాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Advertisement