Page Loader
OG: OG నుండి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ విడుదల  
OG: OG నుండి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్‌ లుక్ విడుదల

OG: OG నుండి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ విడుదల  

వ్రాసిన వారు Stalin
Mar 24, 2024
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో ఓజి ఒకటి.ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగులో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇమ్రాన్ 45వ పుట్టినరోజు పురస్కరించుకొని OG చిత్రం నుండి అయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. మర్డర్,జన్నత్,ఆషిక్ బనాయా ఆప్నే వంటి హిందీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ, పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, హష్మీ సిగరెట్ వెలిగిస్తున్నట్లు మనం చూడచ్చు. పోస్టర్ పై "హ్యాపీ బర్త్ డే టు ఓమి భాయ్" అని రాసుంది. దీంతో ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ఓమి భాయ్ గా కనిపించబోతున్నాడని అర్థమవుతోంది.

Details 

 హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్

ఈ సినిమాకి డివివి దానయ్య ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సలార్'తో సెన్సేషనల్ అయిన శ్రియా రెడ్డీ కీలక పాత్ర పోషిస్తోంది. అర్జున్ దాస్, తేజ్ సప్రూ.. ఇలా చాలా మంది స్టార్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈ మధ్యే ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్