LOADING...
Malaika Arora: నేనెందుకు నా డ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాలి.. ఐటమ్‌ సాంగ్స్‌ ట్రోల్స్‌పై మలైకా కామెంట్స్‌ 
ఐటమ్‌ సాంగ్స్‌ ట్రోల్స్‌పై మలైకా కామెంట్స్

Malaika Arora: నేనెందుకు నా డ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాలి.. ఐటమ్‌ సాంగ్స్‌ ట్రోల్స్‌పై మలైకా కామెంట్స్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐటమ్‌ సాంగ్స్‌తోనే ప్రత్యేక క్రేజ్‌ సొంతం చేసుకున్నారు నటి మలైకా అరోరా. ఆమె చేసిన కొన్ని పాటలు సినిమాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గతేడాదే, రెండు పాటల్లో మలైకా తన డ్యాన్స్‌ నైపుణ్యంతో మెరిశారు. కొందరు ఆమెను ఈ విషయంలో ట్రోల్‌ చేయగా.. తాజాగా ఆమె స్పందించారు. ఈ పాటలు ఆమెకు శక్తిని అందిస్తున్నాయని, ఐటమ్‌ సాంగ్స్‌ విషయంలో ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు.

వివరాలు 

పాటల ద్వారా ప్రేక్షకులను అలరించడం నాకు ఎంతో శక్తినిస్తుంది: మలైకా

"'నేను డ్యాన్స్‌ చేయడం ఎందుకు తగ్గించాలి. కారణం ఏమిటి? దీని కోసం క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటి? . ట్రోల్స్‌ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. డ్యాన్స్‌ ఒక గొప్ప కళ. దాన్ని నిజమైన గౌరవంతో ఆస్వాదించాలి. 52 ఏళ్ల వయసులోనూ ఇలాంటి పాటల్లో నిష్ణాతిగా డ్యాన్స్‌ చేయగలగడం నా అదృష్టం. సరైన మార్గంలోనే నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ఈ పాటల ద్వారా ప్రేక్షకులను అలరించడం నాకు ఎంతో శక్తినిస్తుంది. మరికొందరు మహిళలు ఇలాగే హుషారుగా ఉంటే, దానిని చూడడం నాకు గొప్ప ఆనందం" అని మలైకా తెలిపారు.

వివరాలు 

 'పాయిజన్ బేబీ'తో.. 

'ఛల్ ఛయ్య ఛయ్య', 'మున్నీ బద్నామ్ హుయీ' నుంచి 'అనార్కలీ డిస్కో చాలి' వరకూ ఎన్నో పాటల్లో మలైకా తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించారు. గతేడాది హనీ సింగ్‌తో కలిసి 'చిల్‌గమ్'లో, ఆదిత్య సర్పోదర్‌ దర్శకత్వంలో వచ్చిన 'థామా'లో రష్మికతో కలిసి 'పాయిజన్ బేబీ'తో ఆకట్టుకున్నారు.

Advertisement