తదుపరి వార్తా కథనం

official: మోహన్‌లాల్ 'మలైకోట్టై వాలిబా'కి సీక్వెల్ ఫిక్స్.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 25, 2024
02:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan lal) హీరోగా నటించిన చిత్రం మలైకోట్టై వాలిబన్(Malaikottai Valiban).లిజో జోష్(Lijo josh) పెల్లిస్సెరీ ఈ పీరియాడిక్ డ్రామాను డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమా ఈ రోజు విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మోహన్ లాల్ లుక్.. ఆహార్యం ప్రతీది అభిమానులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించింది.
అయితే, ఇప్పుడు మలైకోట్టై వాలిబ్‌కి సీక్వెల్ రూపొందుతోందని మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు.
సినిమా చివర్లో త్వరలోనే ఈ సినిమా కి సీక్వెల్ ఉంటుందని ప్రకటన చెయ్యడంతో అభిమానుల్లోకొత్త జోష్ నెలకొంది.
అయితే, సినిమాల్లో సీక్వెల్ విడుదల తేదీకి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకి ప్రశాంత్ పిళ్లై మ్యూజిక్ డైరెక్టర్.