మళయాలం నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత: ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు
మళయాలం నటుడు, కమెడియన్ ఇన్నోసెంట్ ఆదివారం రాత్రి కన్నుమూసారు. కొన్ని రోజుల క్రితం గొంతులో ఏదో సమస్య కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఇన్నోసెంట్. తమిళం, కన్నడ, మళయాలం, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో 750కి పైగా చిత్రాల్లో నటించారు ఇన్నోసెంట్. ఆయన నటించిన సినిమాల్లోంచి ఆయనకు పేరు తెచ్చిన పాత్రల గురించి మాట్లాడుకుందాం. రామోజీ రావ్ స్పీకింగ్: 1989లో రిలీజైన ఈ చిత్రం, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా నటుడిగా ఇన్నోసెంట్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాలో డ్రామా కంపెనీని నడిపే పాత్రలో నటించిన ఇన్నోసెంట్, అందరి హృదయాలను కదిలించాడు. ఆ తర్వాత ఈ సినిమాకు రెండు సీక్వెల్స్ వచ్చాయి.
ఇన్నోసెంట్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలు
దేవాసురం: మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమాను ఐవీ శశి డైరెక్ట్ చేసారు. ఇన్నోసెంట్ కెరీర్లోనే ఈ సినిమానుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 1993లో రిలీజైన ఈ సినిమా గురించి మాట్లాడిన ఇన్నోసెంట్, ఐవీ శశి తప్ప వేరే ఎవ్వరూ తనకు దేవాసురంలోని అంత ప్రాముఖ్యం ఉన్న పాత్ర, ఆ టైమ్ లో ఇచ్చేవారు కాదని అన్నాడు. మై డియర్ ముతచాన్: ఇది పిల్లల సినిమా: ఇందులో పోలీస్ ఇన్స్పెక్టర్ కేపీ ఆదియోగి పాత్రలో ఇన్నోసెంట్ కనిపించారు. తల్లిదండ్రులు సడెన్ గా చనిపోతే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇందులో చూపించారు. మలామల్ వీక్లీ: ఇందులో పాత్ర నిడివి తక్కువే అయినా, పాత్ర ప్రభావం సినిమా మీద ఎక్కువగా ఉంటుంది.