Malayalam director :సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత, రచయిత బిజు వట్టప్పర సోమవారం కేరళలో మరణించారు. కేరళలోని మువట్టుపుజలో ఒక న్యాయవాదిని ఓ కేసుకు సంబంధించి కలవడానికి వెళుతుండగా బిజు సృహతప్పి పడిపోయారు. అనంతరం ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మాతృభూమి కథనం ప్రకారం, ప్రస్తుతం అయన మృతదేహాన్ని మువట్టుపుజా తాలూకా ఆసుపత్రిలో ఉంచారు. బిజు వట్టప్పరకు అతని తండ్రి రవి (దేవన్), కుమార్తె దేవానందన ఉన్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు కాసేపట్లో వెల్లడి కానున్నాయి.
'ఇదవజియుం తుంబపూవుం' అనే కవితకు కుట్టికృష్ణన్ సాహిత్య అవార్డు
బిజు వట్టప్పర సినిమాలు, టెలివిజన్ సీరియల్స్, డాక్యుమెంటరీలకు పనిచేశారు. అయన పనిచేసిన ప్రాజెక్ట్‌ల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయన దర్శకత్వం వహించిన 'రామ రావణన్' , 'స్వంతం భార్య జిందాబాద్' ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కళాభవన్ మణి నటించిన 'లోకనాథన్ ఐఏఎస్', 'కళాభం' చిత్రాలకు స్క్రీన్ ప్లేకి కూడా పనిచేశాడు. ఆయన రాసిన కొన్ని నవలల్లో 'చక్కర వావ', 'వెలుత కథరీనా', 'శంకుపుష్పం' ఉన్నాయి. ఈ నవలలు తరువాత సీరియల్స్‌గా మార్చబడ్డాయి. బిజు వట్టప్పర తన 'ఇదవజియుం తుంబపూవుం' అనే కవితకు కుట్టికృష్ణన్ సాహిత్య అవార్డును అందుకున్నారు.