LOADING...
Mohanlal: ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు 
ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

Mohanlal: ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2025
07:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళకు చెందిన ప్రముఖ నటుడు,మలయాళ సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా పేరు పొందిన మోహన్‌లాల్‌ ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారంకు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి గాను ఆయన ఈ గౌరవం అందుకోబోతున్నట్లు కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. భారతీయ సినిమాకి మోహన్‌లాల్‌ అందించిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ఆయనకు ప్రకటించినట్టు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నటుడిగా మాత్రమే కాకుండా,దర్శకుడు,నిర్మాతగా కూడా ఆయన ఎన్నో దశాబ్దాలుగా భారత చిత్రసీమకు చేసిన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. భారతీయ సినిమా ప్రపంచంపై మోహన్‌లాల్‌ వేసిన చెరగని ముద్రను ఆప్రకటనలో ప్రశంసించింది. రాబోయే సోమవారం,ఈ నెల 23న జరగనున్న 71వజాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమంలో మోహన్‌లాల్‌కు ఈప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందజేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్