Page Loader
ఓటిటిలోకి నిత్యామీన‌న్ మాస్ట‌ర్ పీస్ వెబ్‌సిరీస్.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా
ఓటిటిలోకి నిత్యామీన‌న్ మాస్ట‌ర్ పీస్ వెబ్‌సిరీస్.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా

ఓటిటిలోకి నిత్యామీన‌న్ మాస్ట‌ర్ పీస్ వెబ్‌సిరీస్.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 25, 2023
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళం బొద్దుగుమ్మ నిత్యామీన‌న్ మాస్ట‌ర్ పీస్ వెబ్‌సిరీస్ ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ మేరకు బుధ‌వారం నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఇది లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మ‌ల‌యాళ వెబ్ సిరీస్ తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ అందుబాటులో ఉందని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ప్రకటన చేసింది. మాస్ట‌ర్ పీస్ వెబ్‌సిరీస్‌కు శ్రీజీత్ ఎన్. ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కీలక పాత్రల్లో ష‌రాఫుద్దీన్‌, రెంజి ఫ‌ణిక్క‌ర్‌, మాల పార్వ‌తి నటించారు. భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన ఓ జంట పెళ్లితో ఒక్క‌టైన త‌ర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న అంశానికి వినోదాత్మ‌కం జత అయ్యింది.

details

నిత్యామీన‌న్ న‌టించిన ఫ‌స్ట్ వెబ్ సిరీస్ ఇదే

ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట‌ర్ శ్రీజీత్ ఆవిష్క‌రించారు. బ్యూటిఫుల్ హాట్ హీరోయిన్ నిత్యామీన‌న్ రియా అనే పాత్రలో ఈ చిత్రంలో న‌టించింది. గ‌త సినిమాల‌కు, సిరీస్‌ల‌కు భిన్నంగా నిత్యా, ఫుల్ టైమ్ ఫన్నీ పాత్రలో నవ్వించనుంది. మరోవైపు మాతృభాష‌ మ‌ల‌యాళంలో నిత్యామీన‌న్ న‌టించిన ఫ‌స్ట్ వెబ్ సిరీస్ కూడా మాస్ట‌ర్ పీస్ వెబ్‌సిరీస్ కావ‌డం కొసమెరుపు. బ్రీత్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యామీన‌న్, తెలుగులో మోడ్ర‌న్ ల‌వ్ ఇన్ హైద‌రాబాద్‌, శ్రీమ‌తి కుమారి వెబ్‌సిరీస్‌ల‌లోనూ మెప్పించింది. శ్రీమ‌తి కుమారి వెబ్‌సిరీస్, ఇఠీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ప్ర‌స్తుతం సినిమాల‌కు బ్రేక్ తీసుకున్న నిత్యా వెబ్‌సిరీస్‌ల‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది.