
మళ్ళీ పెళ్ళి టీజర్: పవిత్ర, నరేష్ ప్రేమకథకు సినిమా రూపం
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్రా లోకేష్ మధ్య ప్రేమాయణం గురించి తెలియని వాళ్ళు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.
నరేష్, పవిత్రలు పెళ్ళి చేసుకుంటామని కూడా అనౌన్స్ చేసారు. అయితే తాజాగా వీరిద్దరూ ప్రధాన పాత్రలో కనిపించిన మళ్ళీ పెళ్ళి చిత్ర టీజర్ ఈరోజు విడుదలైంది.
ఈ టీజర్ లో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి. టీజర్ లోని అంశాలు చూస్తుంటే నరేష్, పవిత్రల జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తుంటాయి.
నరేష్ భార్య రమ్య, హోటల్ లో నరేష్ ని, పవిత్రని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సీన్ ని గుర్తొచ్చేలా మళ్ళీ పెళ్ళి టీజర్ లో ఒక సీన్ కనిపించింది.
Details
సొంత స్టోరీనే సినిమాగా చూపించబోతున్న నరేష్
నరేష్, పవిత్రల లవ్ స్టోరీని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారని టీజర్ చూస్తే అర్థమైపోయింది. ప్రధాన పాత్రల్లో నరేష్, పవిత్ర నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ టీజర్, ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. గతంలో ఇంటర్నెట్ లో వచ్చిన వాటినే, టీజర్ లోనూ చూపిస్తారని ఎవ్వరూ అనుకోలేదు.
ఇటు తెలుగులోనూ, అటు కన్నడలోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. విజయకృష్ణ మూవీస్ బ్యానర్ లో, తనే నిర్మాతగా మారి మళ్ళీ పెళ్ళి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు నరేష్.
దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. మే నెలలో విడుదల చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మళ్ళీ పెళ్ళి టీజర్
True Love triumphs over all odds❤️🔥
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) April 21, 2023
Presenting you the most Thrilling & Exciting #MalliPelliTeaser 💥
- https://t.co/3cGioSKFO7#MalliPelli
Written & Directed by @MSRajuOfficial
Co starring #PavitraLokesh
RELEASING THIS MAY ❤️ pic.twitter.com/csaax0alZ3