NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మళ్ళీ పెళ్ళి ట్రైలర్: ప్రేమలో ఏది చేసినా తప్పే కాదంటున్న నరేష్ 
    మళ్ళీ పెళ్ళి ట్రైలర్: ప్రేమలో ఏది చేసినా తప్పే కాదంటున్న నరేష్ 
    సినిమా

    మళ్ళీ పెళ్ళి ట్రైలర్: ప్రేమలో ఏది చేసినా తప్పే కాదంటున్న నరేష్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 11, 2023 | 12:54 pm 0 నిమి చదవండి
    మళ్ళీ పెళ్ళి ట్రైలర్: ప్రేమలో ఏది చేసినా తప్పే కాదంటున్న నరేష్ 
    మళీ పెళ్ళి ట్రైలర్ విడుదల

    సీనియర్ యాక్టర్ నరేష్, సీనియర్ నటి పవిత్రా లోకేష్.. ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మళ్ళీ పెళ్ళి. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అందరిలోనూ ఆసక్తి బాగా పెరిగింది. టీజర్ రిలీజ్ అయినపుడు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ డబుల్ అయ్యింది. ఎందుకంటే నరేష్ పవిత్రా లోకేష్ ల జీవితంలో జరిగిన సంఘటనలు ఈ సినిమాలో కనిపించాయి. ప్రస్తుతం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. టీజర్ లో కనిపించిన సీన్లకు పొడిగింపుగా ట్రైలర్ లో సీన్లు కనిపించాయి. ఇద్దరు భార్యలను వదిలేసిన నరేష్ పాత్ర, పవిత్రా లోకేష్ పాత్ర పట్ల ఆకర్షితం అవుతుంది. లేటు వయసులో పవిత్ర పాత్రతో ప్రేమలో పడినట్లు, ఆ విషయాన్ని ఆమెతో చెప్పాలని ట్రై చేసినట్లు చూపించారు.

    మే 26న విడుదలవుతున్న మళ్ళీ పెళ్ళి 

    భర్తంటే ఇష్టం లేని పవిత్ర పాత్ర, నరేష్ ప్రేమను ఒప్పుకున్నట్లు చూపించారు. ఆ తర్వాత ఈ న్యూస్, మీడియాలో సెన్సేషన్ అయినట్టుగా ట్రైలర్ లో ఉంది. ఈ ట్రైలర్ మొత్తంలో కనిపించిన సీన్లన్ని గతంలో సోషల్ మీడియాలో నరేష్, పవిత్రల బంధం గురించి వచ్చిన వార్తల్లాగే ఉన్నాయి. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను మే 26వ తేదీన థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ కృష్ణ బ్యానర్ పై నిర్మాతగా మారి నరేష్ నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.

    మళీ పెళ్ళి ట్రైలర్ విడుదల

    Everything is Fair in Love & War ❤️‍🔥

    Unvieling the Madness of Love with #MalliPelli Trailer 💥
    - https://t.co/KpJJnh5vVx#MalliPelliOnMay26 💕

    Co🌟ing #PavitraLokesh

    Written & Directed by @MSRajuOfficial@vanithavijayku1 @sureshbobbili9 @VKMovies_ @adityamusic pic.twitter.com/cyHm2n7oxf

    — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) May 11, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ట్రైలర్ టాక్
    తెలుగు సినిమా

    ట్రైలర్ టాక్

    ఆదిపురుష్ ట్రైలర్: అన్నీ కుదిరేసినట్టే  ఆదిపురుష్
    కస్టడీ ట్రైలర్: ముఖ్యమంత్రి కారునే ఆపేసిన కానిస్టేబుల్  తెలుగు సినిమా
    ఛత్రపతి ట్రైలర్: నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్  బాలీవుడ్
    మ్యూజిక్ స్కూల్ ట్రైలర్: పిల్లల కలలను పట్టించుకోవాలని చెప్పే కథ  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: పాన్ ఇండియా హీరోగా మారబోతున్న స్టార్ జీవితంలోని ఆసక్తికర విషయాలు  పుట్టినరోజు
    రాజ్ తరుణ్ బర్త్ డే: తను నటించిన వాటిల్లో అందరికీ నచ్చిన సినిమాలు  పుట్టినరోజు
    జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని సినిమాల్లోకి వచ్చి స్టార్లుగా మారిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు  సినిమా
    వివాదాల సినిమాలో నటించిన హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలు; ఎవరో గుర్తుపట్టారా?  సినిమా
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023