Mallika sherawat: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్‌కు నాపై క్రష్.. మెసేజ్‌లు చేస్తుంటాడు: మల్లికా శెరావత్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్‌కు తనపై క్రష్ ఉందని, ఆయన తనకు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా మెసేజ్‌లు కూడా చేస్తుంటారని మల్లికా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. త్వరలో ప్రారంభం కానున్న రియాలిటీ షో 'ది ట్రెయిటర్స్ 2'లో ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
అధికారిక స్పందన లేదా ధ్రువీకరణ రాలేదు..
ఈ షోలో తోటి కంటెస్టెంట్ ఆదిత్య కులశ్రేష్ఠ.. "మీకు ఎవరిపైనైనా క్రష్ ఉందా? లేక మీపైనే అందరికీ క్రష్ ఉంటుందా?" అని మల్లికాను ప్రశ్నించారు.
దీనికి ఆమె స్పందిస్తూ.. "నాపైనే అందరికీ క్రష్ ఉంటుంది. ఇటీవల టామ్ క్రూజ్‌కు కూడా నాపై క్రష్ ఏర్పడింది.
నేను అబద్ధం చెప్పడం లేదు. నా దగ్గర ఫోన్ ఉండుంటే.. మేమిద్దరం కలిసి పార్టీ చేసుకున్న వీడియోలను మీకు చూపించేదాన్ని" అని చెప్పారు.
అంతేకాదు.. టామ్ క్రూజ్ అద్భుతమైన వ్యక్తి అంటూ ఆమె ప్రశంసించారు.
అయితే, మల్లికా శెరావత్ చేసినవి కేవలం ఆమె వ్యాఖ్యలు మాత్రమేనని సమాచారం.
విషయంపై టామ్ క్రూజ్ లేదా ఆయన ప్రతినిధుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన లేదా ధ్రువీకరణ రాలేదు.
వివరాలు
ఆగస్టు 13 నుంచి 'ది ట్రెయిటర్స్ 2'
ప్రముఖ రియాలిటీ షో 'ది ట్రెయిటర్స్' మొదటి సీజన్ విజయవంతం కావడంతో.. ఇప్పుడు రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఆగస్టు 13 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ప్రసారం కానుంది.
ఇది స్ట్రాటజీ ఆధారిత గేమ్ షో. ఇందులో కంటెస్టెంట్లను రహస్యంగా 'ఫెయిత్‌ఫుల్స్', 'ట్రెయిటర్స్'గా విభజిస్తారు. మోసం, వ్యూహాలు, పొత్తుల ద్వారా చివరికి విజేతను నిర్ణయిస్తారు.
ఈ సీజన్‌లో మల్లికా శెరావత్‌తో పాటు మునవర్ ఫరూఖీ, శ్వేతా తివారీ, రియా చక్రవర్తి, క్రిస్టల్ డిసౌజా, దలీప్ తాహిల్, అభిషేక్ మల్హాన్ వంటి పలువురు ప్రముఖులు కంటెస్టెంట్లుగా పాల్గొంటున్నారు.
మొత్తంగా షో ప్రసారం కాకముందే మల్లికా శెరావత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి.