
మామా మశ్చీంద్ర సెకండ్ లుక్: అప్పుడు లావుగా, ఇప్పుడు ముసలివాడిగా కనిపిస్తున్న సుధీర్ బాబు
ఈ వార్తాకథనం ఏంటి
హీరో సుధీర్ బాబు మామా మశ్చీంద్ర సినిమాతో కొత్తగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం, ఈ సినిమా నుండి రిలీజ్ అవుతున్న లుక్ పోస్టర్స్ చూస్తే అర్థమైపోతోంది.
ఇంతకుముందు రిలీజైన ఫస్ట్ లుక్ లో లావుగా, పొట్టతో కనిపించిన సుధీర్ బాబు, ఈ సారి సన్నగా కనిపిస్తున్నాడు. కానీ వయసు ముదిరినవాడిలా కనిపిస్తున్నాడు.
బాగా పెరిగిన గడ్డం, తెల్లబడ్డ జుట్టుతో, సీరియస్ గా చుస్తూ, కుర్చీలో కూర్చుని చేతిలో గన్ పట్టుకుని ఉన్నాడు. ఈ క్యారెక్టర్ ని పరశురామ్ గా పరిచయం చేసింది చిత్రబృందం.
ఐతే ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో సుధీర్ బాబు కనిపిస్తారట. అంటే, మరో పాత్ర లుక్ ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
సుధీర్ బాబు
హై బడ్జెట్ తో రూపొందుతున్న మామా మశ్చీంద్ర
మూడు పాత్రల్లో రెండు పాత్రల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసారు. మరికొద్ది రోజుల్లో మూడవ పాత్రని రిలీజ్ చేస్తారట. ఇందులో యంగ్ సుధీర్ బాబు కనిపించనున్నారని అంటున్నారు.
మామా మశ్చీంద్ర మూవీ, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని వినిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను హరషవర్ధన్ డైరెక్ట్ చేస్తున్నారు.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, పీజీ విందా కెమెరా బాధ్యతలు తీసుకున్నారు.
గతకొన్ని రోజులుగా సుధీర్ బాబుకు సరైన హిట్ పడలేదు. సమ్మోహనం తర్వాత ఆ స్థాయి విజయం రాలేదనే చెప్పాలి. శ్రీదేవి సొడా సెంటర్, హంట్ చిత్రాలు తీవ్రంగా నిరాశ పర్చాయి.
మరి మామా మశ్చీంద్ర సినిమాతోనైనా మళ్ళీ విజయం అందుకుంటాడేమో చూడాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మామా మశ్చీంద్ర సెకండ్ లుక్: ముసలివాడిగా కనిపిస్తున్న సుధీర్ బాబు
We decided one surprise wasn't enough 😁 Meet #Parasuram!!#MaamaMascheendra#SBasParasuram@HARSHAzoomout @chaitanmusic @pgvinda @AsianSuniel @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/WNW2PVsWR5
— Sudheer Babu (@isudheerbabu) March 4, 2023