Loading...
Mammootty vs Dulquer Salmaan: ముమ్ముటి వర్సెస్ దుల్కర్.. ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో తండ్రీకొడుకులు
ముమ్ముటి వర్సెస్ దుల్కర్.. ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో తండ్రీకొడుకులు

Mammootty vs Dulquer Salmaan: ముమ్ముటి వర్సెస్ దుల్కర్.. ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో తండ్రీకొడుకులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో ఆసక్తికరమైన పోటీలు కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు దక్షిణాది చిత్రసీమలో ఓ అరుదైన క్లాష్ జరగబోతోంది. అది కూడా ఒకే భాషలో కాకుండా.. వేర్వేరు భాషల సినిమాలతో తండ్రీకొడుకులు ఒకే రోజు బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ మరో వారంలో ఈ ఆసక్తికరమైన పోటీకి సిద్ధమవుతున్నారు. నవంబర్ 20న వీరిద్దరి సినిమాలు విడుదల కానుండటంతో ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వివరాలు

తెలుగు సినిమాతో దుల్కర్ సల్మాన్

మలయాళం కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ దుల్కర్ సల్మాన్ టాలీవుడ్‌లో బిజీగా మారిపోయారు.

ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

వివరాలు

తమిళ చిత్రంతో మమ్ముట్టి ఎంట్రీ

మరోవైపు దుల్కర్ తండ్రి, లెజెండరీ నటుడు మమ్ముట్టి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'ఓం' (O.M) కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి 'అమరన్' ఫేమ్ రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.

పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మమ్ముట్టి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.

తమిళంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంపై కోలీవుడ్‌తోపాటు ఇతర భాషల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

తండ్రీకొడుకుల బాక్సాఫీస్ పోరుపై ఆసక్తి

మలయాళానికి చెందిన తండ్రీకొడుకులు వేర్వేరు చిత్ర పరిశ్రమల సినిమాలతో ఒకే రోజు పోటీ పడుతుండటం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఒకవైపు దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమాతో వస్తుంటే.. మరోవైపు మమ్ముట్టి స్ట్రెయిట్ తమిళ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మరి నవంబర్ 20న జరగనున్న ఈ అరుదైన బాక్సాఫీస్ పోరులో కొడుకు తెలుగులో విజయం సాధిస్తాడా? లేక తండ్రి తమిళంలో సత్తా చాటుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT