LOADING...
Vijay: కోలీవుడ్ నటుడు విజయ్‌ ఇంట్లో భద్రతా లోపం.. టెర్రస్‌పై అగంతకుడు కలకలం
కోలీవుడ్ నటుడు విజయ్‌ ఇంట్లో భద్రతా లోపం.. టెర్రస్‌పై అగంతకుడు కలకలం

Vijay: కోలీవుడ్ నటుడు విజయ్‌ ఇంట్లో భద్రతా లోపం.. టెర్రస్‌పై అగంతకుడు కలకలం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ నటుడు,తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ (Vijay) నివాసంలో భద్రతా లోపం చోటుచేసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అనుమానాస్పద వ్యక్తి ఆయన ఇంట్లోకి చొరబడటంతో ఆ పరిసరాల్లో గందరగోళం నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం, నీలంకరై ప్రాంతంలోని విజయ్‌ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. టెర్రస్‌పై తిరుగుతుండటాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా, నిందితుడు అరుణ్‌ (24) అని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో అతడు గత నాలుగేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని తేలింది. అనంతరం చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వివరాలు 

వై ప్లస్‌ అనేది నాలుగో అత్యున్నత స్థాయి భద్రత

ఇటీవల కేంద్ర హోంశాఖ విజయ్‌కు వై+కేటగిరీ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ఈ భద్రతా స్థాయి దేశంలో నాలుగో అత్యున్నత స్థాయిగా పరిగణించబడుతుంది. వై ప్లస్‌ కింద మొత్తం 11మంది సిబ్బంది భద్రత బాధ్యతలు నిర్వర్తిస్తారు.వారిలో 2 నుంచి 4 మంది కమాండోలు ఉండగా,మిగతా వారు స్థానిక పోలీసులు ఉంటారు. ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి ఎలా లోపలికి ప్రవేశించాడనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. చెన్నైలోని ప్రముఖులు, ముఖ్యంగా రాజకీయ మరియు సినీ ప్రముఖుల భద్రతపై ఈ సంఘటన ఆందోళనలు రేకెత్తిస్తోంది. అయితే, తాజా ఘటనపై విజయ్‌ పార్టీ తరఫున ఇంకా ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు.