MSVP : మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఫిక్స్.. రంగంలోకి రామ్ చరణ్?
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు'. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవ్వనుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నది. చిరంజీవిని అత్యంత స్టైలిష్‌గా చూపిస్తూ అనిల్ రావిపూడి రూపొందించిన ప్రోమోలు సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారాయి. సినిమాపై అంచనాలను పెంచడంలో సాంగ్స్ కీలకపాత్ర పోషించాయి. ముఖ్యంగా చిరంజీవి-నయనతార జోడీ సాంగ్స్ ప్రేక్షకుల మనసులను గెల్చుకున్నాయి. తాజాగా విడుదలైన 'మెగా విక్టరీ మాస్ సాంగ్' అభిమానుల్లో అదనపు ఉత్సాహాన్ని నింపింది. ఈ సాంగ్‌లో మెగాస్టార్‌తో పాటు విక్టరీ వెంకటేష్ స్టెప్పులు చేయడం, థియేటర్లలో జోరు తేల్చేలా ఉంది.
వివరాలు
అమెరికాలో 15రోజులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్
అనిల్ రావిపూడి కు సంక్రాంతి సీజన్‌లో సాధారణంగా మంచి సక్సెస్ రేటు ఉండటంతో పాటు, మెగాస్టార్ క్రేజ్ ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. అందుకే ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. ఇక అమెరికాలో, సినిమా 15 రోజులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అలాగే.. భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో రెండు పెద్ద ఈవెంట్స్ ప్లాన్ అవుతున్నాయి. ఏపీలో ఈస్ట్ గోదావరిలో ఒక ఈవెంట్ జరుగనుంది,ఈ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
వివరాలు
ఈవెంట్ విషయపై మేకర్స్ సైడ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది
అలాగే, హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా జనవరి 12న రిలీజ్ కానున్నప్పటికీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 7న ప్లాన్ చేసారు. అయితే, ఈవెంట్ విషయంపై మేకర్స్ సైడ్ నుంచి తుది క్లారిటీ ఇంకా రాకపోవడం గమనార్హం.