MSVG: 'మన శంకరవరప్రసాద్ గారు' ఆల్‌టైమ్ రికార్డ్.. ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బాక్సాఫీస్‌లో 'మన శంకరవరప్రసాద్ గారు' హవా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రమోషన్స్ నుంచే భారీ స్పందన వచ్చింది. మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ఈ వీకెండ్‌లో మరిన్ని భారీ కలెక్షన్లు రాబట్టేందుకు సినిమా సిద్ధమైంది.
Details
కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన చిరంజీవి
ఇప్పటివరకు అపజయమే ఎరుగని కామెడీ టైమింగ్‌తో కూడిన అనిల్ రావిపూడి దర్శకత్వం, అంతకుమించిన కామెడీ టైమింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించడమే సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. అంతేకాక, సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు ప్రకటించడంతో, సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. చివరకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్‌లో అత్యంత పాపులర్‌గా మారి, హృదయాలను గెలుచుకుంటూ బాక్సాఫీస్‌లో దూసుకెళ్తోంది.