Manamey Trailer: మంచి మనస్సు వున్న పాత్రలో శర్వానంద్ 'మనమే'
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ హీరో శర్వానంద్ సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్లకు క్యూ కడతారు.
ఆయన ప్రస్తుతం నటిస్తున్న'మనమే' చిత్రం కూడా ఈ కోవకే చెందింది. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేసింది.
ఈ మూవీ పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీంతో ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ తరుణంలో 'మనమే' మూవీ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.
Details
సున్నితమైన భావాలు, గందరగోళం, కామెడీ ట్రాక్ కలగలిసి 'మనమే'
జూన్ 1న 'మనమే' మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు వారు ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.
ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ పూర్తి ధీమాతో ఉన్నారు.
ఇక ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ క్లాసిక్‌గా ఉండబోతున్నట్లు టీమ్ చెబుతోంది.
ఓ చిన్న పిల్లని పెంచే విషయంలో అనుకోకుండా రెండు భిన్నమైన యువతీ యువకులు కలుస్తారు. హీరోయిన్ కృతి శెట్టి చాలా పద్ధతిగా వుంటుంది.
అయితే శర్వానంద్ ఎటువంటి బాధ్యతలు లేని వ్యక్తిలా తిరుగుతుంటాడు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు కలిసి ఆ పాపను ఎలా పెంచి పెద్ద చేశారు.
సున్నితమైన భావాలు, గందరగోళం, కామెడీ ట్రాక్ కలగలిసి 'మనమే' లో చూడవచ్చు.
Details
జూన్ 7న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం
శర్వా మెయిల్ లీడ్‌లో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
రాహుల్ రామకృష్ణ, సీరత్ కపూర్, రాహుల్ రవిచంద్రన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, అయెషా ఖాన్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.
ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తుండగా, టిజి విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
హీషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. జూన్ 7న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Painting the world with love, fun, and entertainment! 🎨🤩
— People Media Factory (@peoplemediafcy) June 1, 2024
Biggest Entertainer of the Season ~ #ManameyTrailer is out now ▶️ https://t.co/s5TqgbepIX
Experience the magic and excitement at theatres near you on JUNE 7th! 🥳#Manamey @ImSharwanand @IamKrithiShetty @SriramAdittya… pic.twitter.com/yv8U7yESpn