ManchuFamily :మంచు ఫ్యామిలీ వివాదం.. మంచు మనోజ్ ఇంటికి విష్ణు రాకపై ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి.
విభేదాల కారణంగా దాడులు, పోలీస్ కేసులు వరకు వెళ్లాయి. మంచు మనోజ్ తాజాగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై, తన భార్యపై మోహన్ బాబు అనుచరులు దాడి చేశారని ఆరోపించాడు.
ఈ దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితికి చేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అతని కాలు, మెడ భాగంలో దెబ్బలను వైద్యులు గుర్తించారు. మోహన్ బాబు కూడా మనోజ్‌పై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ పరిణామాలు కుటుంబ విభేదాలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Details
హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు
జల్‌పల్లిలో మనోజ్ ఇంటికి, మంచు విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వెళ్లి సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ తీసుకెళ్లాడు.
మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు అనుచరులు, ప్రైవేట్ బౌన్సర్లు గత రెండు రోజులుగా కాపలా కాస్తున్నారు.
దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు, తండ్రి మోహన్ బాబుతో కలిసి జల్‌పల్లిలోని మనోజ్ ఇంటికి వెళ్లనున్నట్లు సమాచారం. మంచు ఫ్యామిలీ విభేదాలు ఇదే మొదటిసారి కాదు.
గతంలో మంచు విష్ణు, బంధువుల ఇంట్లో దాడి చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
మంచు కుటుంబం మధ్య తలెత్తిన ఈ వివాదం ఎంతవరకు వెళ్లనుందో వేచి చూడాల్సిందే.