
Manchu Nirmala: మంచు ఫ్యామిలీ వివాదం.. మనోజ్‌పై తల్లి నిర్మల సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
మంచు కుటుంబంలో విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మంచు మోహన్‌బాబు సతీమణి నిర్మల రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
పహాడీ షరీఫ్ ఎస్‌హెచ్‌వోకు రాసిన ఈ లేఖలో ఆమె చిన్న కొడుకు మంచు మనోజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
నిర్మల తన బర్త్‌డే సందర్భంగా జల్‌పల్లిలోని ఇంటికి పెద్ద కొడుకు మంచు విష్ణు కేక్ తీసుకువచ్చాడని తెలిపారు.
అయితే ఇది మంచు మనోజ్‌కు నచ్చలేదని, కావాలనే సీసీ టీవీ ఫుటేజీని లీక్ చేసి విష్ణుపై అసత్య ఆరోపణలు చేశాడని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఈ ఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా మనోజ్‌నే అని నిర్మల లేఖలో ఆరోపించారు.
Details
విష్ణు దౌర్జన్యం చేయలేదు
విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని, గొడవలకు అతనికి ఎలాంటి సంబంధం లేదని నిర్మల స్పష్టం చేశారు.
ఈ వివాదాల కారణంగా ఇంట్లో పని చేసే ఉద్యోగులు బాధపడుతూ పనిని వదిలి వెళ్లిపోయారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంట్లో విభేదాలు పోలీసుల వరకు వెళ్లడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిర్మల లేఖపై విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
మంచు కుటుంబంలోని ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జర్నలిస్ట్‌పై దాడి కేసులో మంచు మోహన్‌బాబు పై హత్యాయత్నం కేసు నమోదయిన విషయం తెలిసిందే.