DavidReddy: 'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్.. రా, రూత్‌లెస్ లుక్‌తో పవర్‌ఫుల్ అవతారం
ఈ వార్తాకథనం ఏంటి
చాలా కాలం విరామం తర్వాత వెండితెరపై తనదైన యాక్షన్ ముద్రను మళ్లీ చూపించేందుకు మంచు మనోజ్ సిద్ధమవుతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన కొత్త ప్రాజెక్ట్ 'డేవిడ్ రెడ్డి' (#DavidReddy) సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మనోజ్ గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా పూర్తిగా గంభీరంగా, ఊర మాస్ స్టైల్‌లో దర్శనమిచ్చారు. రా అండ్ ఇంటెన్స్ లుక్‌తో ఆయన పాత్ర శక్తివంతంగా కనిపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈసారి మంచు మనోజ్ బాక్సాఫీస్ వద్ద పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారన్న అంచనాలు బలపడుతున్నాయి.
Details
మరన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత
ఈ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ మనోజ్ భావోద్వేగ క్యాప్షన్‌ను జత చేశారు. నాలోని సరికొత్త కోణం.. రా (Raw), రూత్‌లెస్ (Ruthless), అన్‌అపాలజిటిక్ (Unapologetic) అంటూ తన పాత్ర స్వభావాన్ని వివరించారు. ఈ మాటలు, పోస్టర్‌లోని లుక్ కలిసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. 'బిందాస్', 'వేదం' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మంచు మనోజ్, 'డేవిడ్ రెడ్డి' పాత్రతో మళ్లీ ఫామ్‌లోకి వస్తారని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి. మొత్తానికి, మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అత్యంత సీరియస్‌గా, స్పష్టమైన ప్రణాళికతో ప్రారంభించినట్లు ఈ ఫస్ట్ లుక్ స్పష్టంగా చెబుతోంది.