
Manchu Vishnu: 'అన్నా' అంటూ ఎమోషనల్ వీడియోను పోస్టు చేసిన మంచు మనోజ్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా కొద్ది రోజుల క్రితమే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివుడి భక్తుడు కన్నప్ప జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ డివోషనల్ మూవీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన అందుకుంది. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా ఒక కీలక పాత్రలో నటించగా, మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. ఇటీవలే జరిగిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో కన్నప్పలో అవ్రామ్ నటనకు అవార్డు లభించింది. ఈ కార్యక్రమానికి మంచు విష్ణు-వెరానికా దంపతులు, మోహన్ బాబు హాజరయ్యారు. అవార్డు ప్రదాన వేడుక వీడియోను మంచు విష్ణు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
Details
అవ్రామ్ ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది
అవ్రామ్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తప్పకుండా మరోసారి మీ ముందుకు వస్తానంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వీడియోను మంచు మనోజ్ కూడా ట్విట్టర్‌లో షేర్ చేసి, తన అన్న విష్ణును ట్యాగ్ చేస్తూ అవ్రామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు అవ్రామ్.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. నువ్వు ఎప్పటికీ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. ప్రత్యేకంగా నువ్వు విష్ణు అన్నతో పాటు నాన్నగారు మోహన్ బాబుతో కలిసి అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకమని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Details
సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు
మనోజ్ పోస్ట్ చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రక్త సంబంధం అలాంటిదని కామెంట్లు పెడుతున్నారు. ఇక కన్నప్ప రిలీజ్ సమయంలో కూడా మనోజ్ తన సోషల్ మీడియాలో రివ్యూ షేర్ చేశారు. సినిమా చాలా బాగుంది, నేను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చింది. విష్ణు ఇంత బాగా నటిస్తాడని నేను ఊహించలేదంటూ తన అన్నను ప్రశంసించారు. ఇప్పుడు మళ్లీ విష్ణు పేరును ప్రస్తావిస్తూ మరో పోస్ట్ పెట్టడంతో, నెటిజన్లు భయ్యా.. అన్నదమ్ముల మధ్య విభేదాలు సర్దుకున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.