Manchu Manoj: మంచు మనోజ్ 'బ్రూటల్ ఎరా'.. ఒకే రోజు రెండు షాకింగ్ అప్‌డేట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
రాక్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించే మనోజ్, తాజాగా 'బ్రూటల్ ఎరా' (Brutal Era) పేరుతో ఒక భారీ అప్‌డేట్‌ను ప్రకటించారు. కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, రేపు (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా రెండు క్రేజీ అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్లు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండటంతో.. తాజా సమాచారం ప్రకారం, రేపు ఉదయం 11:11 గంటలకు 'RUTHLESS' పేరుతో ఒక అప్‌డేట్, అలాగే సాయంత్రం 4:44 గంటలకు 'BRUTAL' పేరుతో మరో అప్‌డేట్ రానుంది.
Details
హీరోయిన్‌గా మరియా రియాబోషప్క
ఈ ప్రాజెక్ట్‌కు 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండటం విశేషం. హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మరియా రియాబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. మంచు మనోజ్ తన ట్వీట్‌లో 'Brutal Era begins tomorrow' అని పేర్కొనడం చూస్తుంటే, ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. మరి ఈ 'బ్రూటల్ ఎరా'తో మనోజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.