వందకోట్ల బడ్జెట్ తో మంచు విష్ణు మూవీ: కన్నప్ప మూవీ మొదలైంది
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎన్నో రోజులుగా సరైన హిట్టు లేక అవస్థలు పడుతున్నాడు. మంచు విష్ణు చివరి చిత్రం జిన్నా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మంచు విష్ణు మరో సినిమాతో వస్తున్నాడు. ఎన్నో రోజులుగా తాను కలలు కన్న డ్రీమ్ ప్రాజెక్టుని వెండితెర మీదకు తీసుకొస్తున్నాడు. మంచు విష్ణు హీరోగా కన్నప్ప మూవీ ఈరోజే లాంచ్ అయ్యింది. శ్రీకాళహస్తిలో శివుడి సన్నిధిలో కన్నప్ప మూవీ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. నుపుర్ సనన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాకు మహాభారతం సీరియల్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.