LOADING...
Sai Pallavi: మణిరత్నం ప్రేమకథలో సాయిపల్లవి?
మణిరత్నం ప్రేమకథలో సాయిపల్లవి?

Sai Pallavi: మణిరత్నం ప్రేమకథలో సాయిపల్లవి?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిందీతో పాటు దక్షిణాది చిత్రసీమల్లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ కథానాయిక సాయి పల్లవి (Sai Pallavi) తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు 'కల్కి 2' వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్టులకూ ఆమె పేరు వినిపిస్తోంది. అంతేకాదు, ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించనున్న తాజా చిత్రంలోనూ ఆమెకు అవకాశం దక్కినట్టు సమాచారం. ప్రేమకథ నేపథ్యంతో ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు మణిరత్నం సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

వివరాలు 

త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం 

ఈ చిత్రంలో సాయిపల్లవి ముఖ్య పాత్రలో కనిపించనున్నారని, కథానాయకుడిగా విజయ్ సేతుపతి నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. సహజసిద్ధమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన సాయిపల్లవిపై మణిరత్నం గతంలోనే ఓ కార్యక్రమంలో తన అభిమానం వ్యక్తం చేశారు. అలాంటి దర్శకుడి సినిమాలో ఆమె పేరు వినిపించడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement