LOADING...
Mani Ratnam Next Movie: విజయ్‌ సేతుపతితో మణిరత్నం రొమాంటిక్‌ సినిమా.. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌?
విజయ్‌ సేతుపతితో మణిరత్నం రొమాంటిక్‌ సినిమా.. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌?

Mani Ratnam Next Movie: విజయ్‌ సేతుపతితో మణిరత్నం రొమాంటిక్‌ సినిమా.. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం మరో కొత్త సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల కమలహాసన్‌, శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'థగ్‌లైఫ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయనకు ఆ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది. దీంతో చిన్న విరామం తీసుకున్న మణిరత్నం, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జానర్‌లో ఒక లవ్‌ స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ కొత్త చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారనే అంశంపై విభిన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు దృవ్‌ విక్రమ్‌నే ప్రధాన పాత్రలో తీసుకోబోతున్నారని చెబుతుండగా, మరోవైపు శింబుతో సినిమా చేయాలని మణిరత్నం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Details

విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు సమాచారం

శింబుకి కథ కూడా వినిపించినట్లు సమాచారం. అయితే, శింబు ప్రస్తుతం వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'అరసన్‌' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉండటంతో, ఆయన స్థానంలో విజయ్‌ సేతుపతిని ఎంపిక చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇంతకుముందు మణిరత్నం-విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌ 'నవాబ్‌' సినిమాలో కనిపించింది. ఇప్పుడు రెండోసారి ఈ విజయవంతమైన కాంబినేషన్‌ రిపీట్‌ కానుందని సినీ వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రానికి హీరోయిన్‌గా ప్రస్తుతం పుల్‌ ఫామ్‌లో ఉన్న 'రుక్మిణి వసంత్‌'ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Details

త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — రుక్మిణి కోలీవుడ్‌లోకి అడుగు పెట్టింది కూడా విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన 'ఏస్‌' సినిమా ద్వారానే. దీంతో ఈసారి కూడా అదే జంట మళ్లీ తెరపై కనువిందు చేయనుందనే అంచనాలు ఉన్నాయి. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం విజయ్‌ సేతుపతి 'బిగ్‌బాస్‌' తరియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే, తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిరత్నం-విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి పెరిగింది.