LOADING...
The Family Man S3: మనోజ్-ప్రియమణి జోడీ రీ-ఎంట్రీ.. ఓటీటీలో 'ఫ్యామిలీ మ్యాన్ 3' హంగామా! 
మనోజ్-ప్రియమణి జోడీ రీ-ఎంట్రీ.. ఓటీటీలో 'ఫ్యామిలీ మ్యాన్ 3' హంగామా!

The Family Man S3: మనోజ్-ప్రియమణి జోడీ రీ-ఎంట్రీ.. ఓటీటీలో 'ఫ్యామిలీ మ్యాన్ 3' హంగామా! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో భారీగా పాపులర్‌ అయిన వెబ్‌సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' మూడో సీజన్‌ చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ తాజా సీజన్‌ ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ తొలి రెండు సీజన్‌లు ప్రైమ్‌లో అపార విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదే విజయాన్ని కొనసాగించేలా పార్ట్ 3 విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన రాజ్‌ & డీకే ఈ సీజన్‌కు కూడా మెగాఫోన్‌ పట్టారు. ఇందులో 'పాతాళ్‌ లోక్‌' నటుడు జైదీప్‌ అహ్లవత్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్