LOADING...
Marokkasari : 5,430 మీ. ఎత్తులో రికార్డు సృష్టించిన 'మరొక్కసారి' టీమ్‌
5,430 మీ. ఎత్తులో రికార్డు సృష్టించిన 'మరొక్కసారి' టీమ్‌

Marokkasari : 5,430 మీ. ఎత్తులో రికార్డు సృష్టించిన 'మరొక్కసారి' టీమ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 13, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

నరేష్ అగస్త్య, సంజనా సారథి జంటగా నటిస్తున్న 'మరొక్కసారి' సినిమాను సి.కె. ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నితిన్ లింగుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో అద్భుతమైన విజువల్స్‌తో చిత్రీకరించారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా కూడా షూటింగ్ చేయని గురుడోంగ్మార్ లేక్‌లో ఈ చిత్రం చిత్రీకరణ జరిపింది.

Details

త్వరలోనే విడుదల తేదీ ప్రకటన

సముద్ర మట్టానికి 5,430 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో షూటింగ్ చేసిన మొదటి మరియు ఏకైక ఇండియన్ మూవిగా 'మరొక్కసారి' రికార్డు సృష్టించింది. విడుదల చేసిన టైటిల్ పోస్టర్ చూస్తే, ఈ సినిమా ఒక ఆహ్లాదకరమైన ప్రేమకథగా రానుందన్న సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇందులో నరేష్ అగస్త్య, సంజనా సారథి తో పాటు బ్రహ్మాజీ, సుధర్షన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి తదితరులు నటించారు.