Page Loader
Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక మోషన్ పోస్టర్ రిలీజ్ 
త్రిబాణధారి బార్బరిక మోషన్ పోస్టర్ రిలీజ్

Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక మోషన్ పోస్టర్ రిలీజ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2024
07:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైథలాజికల్ కాన్సెప్ట్ ఆధారంగా రామాయణ, మహాభారతం వంటి పురాణ కథలు పరిగణనలోకి తీసుకుని ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఈ జోనర్‌లో ఒక కొత్త చిత్రం "త్రిబాణధారి బార్బరిక్" (Tribanadhari Barbarik) తెరకెక్కుతోంది. ఇందులో భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్ పాత్రను ప్రధానంగా చూపించనున్నారు. సత్యరాజ్ ఈ చిత్రంలో లీడ్ రోల్‌ లో కనిపిస్తారు. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ గ్లింప్స్‌ను షేర్ చేశారు. "ఎవరు తాతా ఇతను?" అని చిన్నారి అడిగినపుడు, "ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా, భీష్ముడా తాతా?" అంటూ జవాబు ఇచ్చే సంభాషణతో టైటిల్‌ గ్లింప్స్ ప్రారంభమవుతుంది.

వివరాలు 

టైటిల్‌ గ్లింప్స్‌తోనే ఈ చిత్రం పట్ల ప్రేక్షకులలో ఆసక్తి

"మాధవా, వెయ్యేనుగుల బలశాలి భీముడికి మనవడిని, ఘటోత్కచుడుకు కుమారుడిని" అంటూ బార్బరిక్ పాత్రను పరిచయం చేసే వీడియోను స్టన్నింగ్‌గా చిత్రీకరించారు. ఇందులో గాండీవధారి అర్జున, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, గరుడ పురాణం వంటి పలు పౌరాణిక గ్రంథాలు, వాటిపై బట్టి వాచ్‌ ను కూడా చూడవచ్చు. టైటిల్‌ గ్లింప్స్‌తోనే ఈ చిత్రం పట్ల ప్రేక్షకులలో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్‌ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్‌ బ్యానర్ పై విజయ్‌పాల్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వశిష్ఠ ఎన్ సింహా, సంచి రాయ్‌, సత్యం రాజేశ్‌, క్రాంతి కిరణ్‌, వీటీవీ గణేశ్‌, మొట్ట రాజేంద్ర, ఉదయ భాను తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.