Page Loader
Ram Charan: 'పెద్ది' సెట్‌లో మాస్ యాక్షన్.. రెడీ అవుతోన్న సినిమా క్లైమాక్స్!
'పెద్ది' సెట్‌లో మాస్ యాక్షన్.. రెడీ అవుతోన్న సినిమా క్లైమాక్స్!

Ram Charan: 'పెద్ది' సెట్‌లో మాస్ యాక్షన్.. రెడీ అవుతోన్న సినిమా క్లైమాక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర కథానాయకుడు రామ్‌ చరణ్‌ తనదైన శైలిలో బ్యాట్‌ ఝుళిపించి 'పెద్ది'గా తన సంతకాన్ని ఎలా వేశాడో చూపించాడు. క్రికెట్ నేపథ్యంలో వచ్చే ఓ ఆసక్తికరమైన సన్నివేశం, 'పెద్ది సిగ్నేచర్‌ షాట్'గా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లోని కొన్ని ముఖ్యమైన దృశ్యాలతోనే పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ ఉత్సాహానికి తగ్గట్టుగానే చిత్రబృందం సినిమా నిర్మాణాన్ని అత్యున్నత ప్రమాణాలతో కొనసాగిస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తుండగా, దర్శకత్వం బుచ్చిబాబు సానా వహిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Details

హైదరాబాద్ లో భారీ సెట్

మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన ప్రత్యేకమైన భారీ సెట్‌లో ఒక కీలకమైన పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు ఎంతో రక్తి కట్టించేలా ఉండనున్నాయని సమాచారం. సుదీర్ఘంగా సాగనున్న ఈ షెడ్యూల్‌తో సినిమా కీలక దశను చేరుకోనుంది. రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సినిమాకు సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎ.ఆర్‌. రెహమాన్ అందిస్తుండగా, ఛాయాగ్రహణాన్ని ఆర్‌. రత్నవేలు, ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాశ్‌ కొల్లా, ఎడిటింగ్‌ను నవీన్‌ నూలి చేపడుతున్నారు. 'పెద్ది' సినిమా ప్రతి అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.