LOADING...
MassJathara : మాస్ జాతర ప్రీమియర్స్ ఖరారు.. రిస్క్‌లో నాగవంశీ!
మాస్ జాతర ప్రీమియర్స్ ఖరారు.. రిస్క్‌లో నాగవంశీ!

MassJathara : మాస్ జాతర ప్రీమియర్స్ ఖరారు.. రిస్క్‌లో నాగవంశీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాను భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడం,క్రాక్‌ తర్వాత రవితేజ స్థాయి హిట్ కొడతాడని ఫ్యాన్స్‌లో ధీమా పెంచింది. అనేక వాయిదాలు, రిష్యూట్ల తర్వాత ఈ ఏడాది దీపావళి అనంతరం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈనెల 31న వరల్డ్ వైడ్ రిలీజ్ జరగనుంది. ఇదే నేపథ్యంలో రవితేజ కూడా సినిమా ప్రమోషన్‌ కోసం ఫుల్‌ ఎనర్జీతో రంగంలోకి దిగారు

Details

ప్రీమియర్స్‌  రిలీజ్‌ రోజు కంటే ఒక రోజు ముందే

ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో 'మాస్ జాతర' ప్రీమియర్స్‌ను రిలీజ్‌ రోజు కంటే ఒక రోజు ముందే నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం కొంత రిస్క్‌ అయినప్పటికీ ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. రవితేజ గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' ప్రీమియర్స్‌ ఫలితాలు డే 1 కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపించాయో తెలిసిందే. ప్రీమియర్స్ ఫలితాలు బాగుంటే డే 1 కలెక్షన్స్ భారీగా వస్తాయి. కానీ అదే ప్రీమియర్స్ ఫలితాలు బాగోలేదని, టాక్ తేడా ఉంటే రీలీజ్‌ కలెక్షన్స్‌ ప్రభావితమవుతాయి. సోలో రిలీజ్ సందర్భంలో ప్రీమియర్స్‌తో రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడనే విషయం ట్రేడ్ లో చర్చనీయాంశంగా మారింది.