Page Loader
Mass Jathara: మాస్ జాతర సినిమా నుంచి 'తు మేరా లవర్' సాంగ్ రిలీజ్ 

Mass Jathara: మాస్ జాతర సినిమా నుంచి 'తు మేరా లవర్' సాంగ్ రిలీజ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మాస్ జాతర'. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మంచి స్పందన పొందిన తరుణంలో, తాజాగా ఈ చిత్రంలోని తొలి పాట "తు మేరా లవర్"ను విడుదల చేశారు. ఈ మ్యూజికల్ ట్రీట్‌ను మీరు కూడా తప్పకుండా వినాల్సిందే! ఈ పాటకు సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, సాహిత్యం భాస్కరభట్ల రాశారు. ప్రత్యేకత ఏమిటంటే, ఈ పాటను AI సాంకేతికత సహాయంతో స్వర్గీయ గాయకుడు చక్రి గాత్రంలో రికార్డు చేశారు. దీన్ని వినగానే ప్రేక్షకులు అయన గాత్రాన్ని మళ్లీ వినగలిగినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

"ఇడియట్"సినిమా "చూపులతో గుచ్చి గుచ్చి" పాట స్టెప్పుల రిపీట్

ఇక భాను మాస్టర్ ఈ పాటకు ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌ను కంపోజ్ చేశారు. ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా, రవితేజ తన గత హిట్ సినిమా "ఇడియట్"లో చేసిన "చూపులతో గుచ్చి గుచ్చి" పాట స్టెప్పులను మళ్లీ రిపీట్ చేయడం జరిగింది. అదే పాట మ్యూజిక్ టోన్‌కు దగ్గరగా ఉండడంతో, ఈ రీమిక్స్‌లా భావించబడుతోంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మళ్లీ థియేటర్లలో రవితేజ ఫ్యాన్స్ మాస్ స్టెప్పులతో అలరించనున్నారని తెలుస్తోంది. ఇంతకీ, ఈ వినోదభరితమైన మాస్ ఎంటర్టైనర్‌ను 2025 వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రవితేజ చేసిన ట్వీట్