
JR. NTR : ఎన్టీఆర్ బర్త్‌డేకి మాస్ ట్రీట్.. రెండు సినిమాల నుంచి స్పెషల్ గిఫ్ట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని విభాగాల్లోనూ తారక్ తనదైన ముద్ర వేసిన సంపూర్ణ నటుడు.
ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. అవే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డ్రాగన్', బాలీవుడ్ యాక్షన్ సీరీస్‌లో భాగంగా తెరకెక్కుతున్న 'వార్ 2'.
ఇదిలా ఉండగా, ఈ నెల 20న తారక్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వేళ మైత్రి మూవీ మేకర్స్ తరఫున శుభవార్త వచ్చింది.
Details
డ్రాగన్ మూవీ గ్లింప్స్ రిలీజ్
తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఆయన పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
ఇంతకుముందే అభిమానుల్లో హైప్ క్రియేట్ చేసిన మరో మూవీ 'వార్ 2'. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయబోతున్న తారక్, ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడట.
ఈ ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సీన్స్‌కి బిగ్ స్క్రీన్ షేక్ అయ్యేలా ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Details
ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా
ఇక వీరిద్దరి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అదే సినిమా హైలైట్‌గా మారే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం, 'వార్ 2' సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను కూడా ఆయన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అంటే ఈ సారి తారక్ పుట్టినరోజు నిజంగా అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు.