తదుపరి వార్తా కథనం
Mechanic Rocky : మెకానిక్ రాకీ సెకండ్ ట్రైలర్ రిలీజ్.. విశ్వక్ సేన్ మాస్ ఎమోషన్ సూపర్బ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 19, 2024
04:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
వరుస హిట్స్‌తో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ సేన్, ప్రస్తుతం 'మెకానిక్ రాకీ' సినిమాతో మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించగా, రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా, నరేష్, సునీల్, రఘురాం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ ట్రైలర్‌లో ట్రయాంగిల్ లవ్‌స్టోరీకి తోడు తండ్రి సంబంధమైన ఎమోషన్, ఓ మెకానిక్ గ్యారేజ్ నేపథ్యమని స్పష్టమవుతోంది. ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది.