
Meenakshi Chowdari -Venkatesh: వెంకటేష్ కొత్త సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి
ఈ వార్తాకథనం ఏంటి
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో హర్రర్ విత్ కామెడీ జోనర్ లో వెంకటేష్ (Venkatesh) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి ఎంపికైంది.
మట్కా, ఖిలాడి, మెకానిక్ రాకీ, లక్కీ భాస్కర్ వంటి సినిమాల్లో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdari) నటించినప్పటికీ ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు.
అందులో ఒక్క రవితేజ తప్ప మిగతా హీరోల పక్కన నటించినా ఆసినిమాలు ప్రేక్షకులక పెద్దగా తెలిసింది లేదు.
ఎన్నో ఆశలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టన మీనాక్షికి ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ హిట్ పడలేదు.
దీంతో ఆమె రూట్ మార్చి అగ్ర హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ పక్కన నటించేందుకు అంగీకరించింది.
Meenakshi Chowdary-Cinema
హీరోయన్స్ దొరకడం లేదా?
వయసులో వెంకటేష్ కు మీనాక్షి చౌదరికి మధ్య 35 ఏళ్లు తేడా ఉన్నా ఈ సినిమా కోసం అగ్రిమెంట్ పై సంతకం చేసింది.
ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తారని తెలుస్తోంది.
హీరోయిన్స్ ప్రియమణి (Priyamani), శ్రద్ధాదాస్ (Shraddha Das), పాయల్ రాజ్ పుత్ (Payal Rajputh) వంటి వారు వెంకటేష్ పక్కన నటించినప్పటికీ ఆయా సినిమాల్లో వారిమధ్య చాలా ఏజ్ గ్యాప్ కనిపించింది.
వెంకటేష్ తో జోడి కట్టేందుకు యంగ్ హీరోయిన్లు ముందుకు వస్తున్నా మిస్ క్యాస్టింగ్ అవుతున్నారు.
దీంతో వెంకటేష్ కు హీరోయిన్స్ దొరకడమే గగనంగా మారిపోయింది.
ఇప్పుడు ఈ సినిమాలోనైనా మీనాక్షి చౌదరి వెంకటేష్ పక్కన సరిజోడిగా కనిపిస్తోందో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.
Venkatesh-Anil Ravipudi
హిట్ ప్లస్ స్టార్ డమ్ కోసమేనా...
అందంతో పాటు అభినయంలోనూ పేరు పెట్టేందుకు వీల్లేని మీనాక్షి చౌదరి ఈ సినిమాతోనైనా స్టార్ డమ్ హీరోయిన్ గా మారిపోతే అంతకంటే అదృష్టం లేదని చెప్పాలి.
మీనాక్షి చౌదరి తాజా నిర్ణయంతో కేవలం హిట్ ట్రాక్ ఎక్కేందుకే సీనియర్ హీరోల పక్కన కుర్ర హీరోయిన్లు జత కడుతున్నారని చెప్పుకోవాలి మరి.