Meenakshi chaudhary: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సాధికారిత బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి నియమితులయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరుగుతుండగా, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
ఆమె నియామకంపై వినిపిస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా స్పందించింది.
ప్రభుత్వం తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా, ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే, వాటిని వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Details
తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
తప్పుడు ప్రచారాలను ప్రోత్సహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
గతేడాది గుంటూరు కారం, లక్కీ భాస్కర్ చిత్రాలతో మీనాక్షి చౌదరి విజయాలను అందుకుంది.
ఈ ఏడాది విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేశ్ ప్రియురాలిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.