NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓకే చెప్పడానికి ఎక్కువ ఆలోచించలేదంటున్న మీరా జాస్మిన్; పదేళ్ల తర్వాత రీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ 
    తదుపరి వార్తా కథనం
    ఓకే చెప్పడానికి ఎక్కువ ఆలోచించలేదంటున్న మీరా జాస్మిన్; పదేళ్ల తర్వాత రీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ 
    విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్

    ఓకే చెప్పడానికి ఎక్కువ ఆలోచించలేదంటున్న మీరా జాస్మిన్; పదేళ్ల తర్వాత రీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 31, 2023
    06:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మీరా జాస్మిన్... తెలుగు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేని హీరోయిన్. అమ్మాయి బాగుంది సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ, ఆ తర్వాత భద్ర, గుడుంబా శంకర్, మహారథి వంటి సినిమాల్లో నటించింది.

    అయితే దాదాపు పదేళ్ళుగా తెలుగు సినిమాల్లో ఆమె కనిపించలేదు. ఆమె నటించిన చివరి తెలుగు చిత్రం మోక్ష. 2013లో రిలీజైంది.

    పదేళ్ళ తర్వాత ప్రస్తుతం విమానం అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో తన రీ ఎంట్రీపై సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

    విమానం సినిమా కథ వినగానే తనకు బాగా నచ్చిందనీ, అందుకే ఎక్కువగా ఆలోచించకుండా ఓకే చెప్పేసినట్లు తెలియజేసింది.

    Details

    వేశ్యగా యాంకర్ అనసూయ 

    విమానం సినిమాలో తన పాత్ర బాగుంటుందనీ, షూటింగ్ జరుగుతున్నంత సేపు తన పాత్ర, విమానం కథ మాత్రమే తన మైండ్ లో ఉండేవనీ, మిగతా విషయాలను తాను పట్టించుకునేది కాదని చెప్పుకొచ్చింది.

    విమానం సినిమాను తాను ఎంపిక చేసుకుందా? లేక తన రీ ఎంట్రీ కోసం విమానం సినిమానే తనను ఎంచుకుందా అనేది అర్థం కావట్లేదని మీరా జాస్మిన్ అన్నారు.

    సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ, యాంకర్ అనసూయ, మాస్టర్ ధృవన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమాను దర్శకుడు శివ ప్రసాద్ తెరకెక్కించారు.

    ఈ సినిమాలో యాంకర్ అనసూయ, వేశ్యగా కనిపిస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ ఇది. జూన్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    RCB vs PBKS : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Jonas Masetti: బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ? పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
    #NewsBytesExplainer: మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి? డీఆర్జీ దళాలు
    Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు విరాట్ కోహ్లీ

    తెలుగు సినిమా

    ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి ఇప్పుడు స్టార్ హీరో; గుర్తుపట్టారా?  సినిమా
    హ్యాపీ బర్త్ డే కార్తీ: పాత సినిమాలను మళ్ళీ గుర్తు చేస్తున్న కార్తీ సినిమా టైటిల్స్  సినిమా
    జపాన్ ఇంట్రో వీడియో: మేడిన్ ఇండియా అంటూ విలక్షణంగా కనిపించిన కార్తీ  సినిమా
    పాన్ ఇండియా సినిమాల కోసం ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్న రామ్ చరణ్?  రామ్ చరణ్

    సినిమా రిలీజ్

    టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తెలుగు సినిమా
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్
    వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే రావణాసుర
    విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్

    సినిమా

    దాదాసాహేబ్ ఫాల్కే బర్త్ డే: భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన వ్యక్తి జీవితంలోని మీకు తెలియని విషయాలు  తెలుగు సినిమా
    ఈ వారం సినిమా: థియేటర్లలో సందడి చేయనున్న ఈ వారం సినిమాలు  తెలుగు సినిమా
    ది కేరళ స్టోరీ సినిమాపై చెలరేగుతున్న వివాదం, నిషేధం విధించాలని డిమాండ్  సినిమా రిలీజ్
    ది కేరళ స్టోరీ: వివాదాల చిత్రానికి IMDBలో టాప్ రేటింగ్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025