Page Loader
వైరల్ అవుతున్న THE కౌంటర్లు: అనసూయ కోసమే అంటున్న నెటిజన్లు 
THE విషయంలో విజయ్ అభిమానులకు అనసూయకు వార్

వైరల్ అవుతున్న THE కౌంటర్లు: అనసూయ కోసమే అంటున్న నెటిజన్లు 

వ్రాసిన వారు Sriram Pranateja
May 09, 2023
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాంకర్ అనసూయకు, విజయ్ దేవరకొండ అభిమనులకు మధ్య ఇంటర్నెట్ లో కామెంట్ల వార్ జరుగుతోంది. విజయ్ నటిస్తున్న ఖుషి సినిమా పోస్టర్ లో The విజయ్ దేవరకొండ అని ఉండడమే ఇందుకుకారణం. పేరుకు ముందు The అని పెట్టుకోవడంపై అనసూయ వ్యంగ్యంగా కామెంట్లు చేసింది. దాంతో, విజయ్ అభిమానులు ఊరుకోలేదు. వాళ్ళు కూడా అనసూయపై కామెంట్లు చేయడం మొదలెట్టారు. అయితే ప్రస్తుతం ఈ The గొడవ ఇండస్ట్రీని తాకినట్టు అనిపిస్తోంది. ఈ విషయంలో ఇండస్ట్రీ నుండి విజయ్ కు మద్దతు పెరుగుతున్నట్టుగా తోస్తోంది. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న బేబి చిత్రం నుండి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్లో అందరి పేర్ల ముందు The అని పెట్టారు.

Details

The విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ తెలియజేసిన హరీష్ శంకర్ 

అలాగే విజయ్ దేవరకొండ బర్త్ డే సీడీపీని రిలీజ్ చేసిన హరీష్ శంకర్ కూడా, " THE" Passion he has THE " temper he holds.... THE " anger he controls .... THE Stardom he achieved... makes him THE " Vijayadevarakonda అని బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేసాడు. ఇలా వరుసగా ది విషయంలో మద్దరుగా కామెంట్లు వస్తుండడంతో ఇవన్నీ యాంకర్ అనసూయకు కౌంటర్లుగా మారుతున్నాయని అంటున్నారు. మరి ఈ విషయమై అనసూయ మళ్ళీ అగ్గి రాజేస్తుందా? లేదా అనేది చూడాలి. అదలా ఉంచితే, విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా, ఖుషి సినిమా నుండి నా రోజా నువ్వే అనే పాట రిలీజైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బేబీ సినిమా నుండి పోస్టర్ రిలీజ్