ఖుషి ఫస్ట్ సింగిల్: మణిరత్నం సినిమా రిఫరెన్సులతో శివ నిర్వాణ సాహిత్యం అదరహో
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఖుషి సినిమా నుండి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసారు. నా రోజా నువ్వే అంటూ సాగే ఈ పాట, వినగానే అమాంతం ఆకట్టుకుంటోంది. పాట మొదటి నుండి చివరి వరకు ఆసాంతం మనోహరంగా ఉంది. లిరికల్ వీడియోలో కనిపించిన విజయ్ దేవరకొండ, సమంత మధ్య సీన్లు ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముస్లిం యువతి పాత్రలో, బురఖా ధరించి, కళ్ళకు కాటుక పెట్టుకుని కొత్తగా ఉంది సమంత. విజయ్ దేవరకొండ కూడా చాలా హ్యాండ్సమ్ గా మెరుస్తున్నాడు. ఈ పాటను ఖుషి సినిమా దర్శకుడు శివ నిర్వాణ, మణిరత్న సినిమా పేర్ల రిఫరెన్సులతో రాయడం విశేషం.
పాటలో మణిరత్నం రిఫరెన్సులివే
నా రోజా నువ్వే, గీతాంజలి, ఓకే బంగారం, అమృత, దళపతి, నాయకుడు, చెలియా, సఖి, ఇలా మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా పేర్లను తన పదాల్లో కూరుస్తూ సరికొత్త వ్యాక్యాలను సృష్టించాడు శివ నిర్వాణ. ఈ పాటకు సంగీతాన్ని సృష్టించిన హేషమ్ అబ్ధుల్ వాహబ్, తనే పాడాడు కూడా. అచ్చ తెలుగు ఉఛ్ఛారణతో వినసొంపుగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో రూపొందుతోంది. మొదటి పాటతో ఆకట్టుకున్న ఖుషి టీమ్, ముందు ముందు ఇలాంటి కంటెంట్ ని ప్రేక్షకులకు అందిస్తుందేమో చూడాలి.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి