Page Loader
Meera Jasmine: యువ రాణి పోస్టర్‌ లో మెరిసిన మీరా జాస్మిన్ 
Meera Jasmine: యువ రాణి పోస్టర్‌ లో మెరిసిన మీరా జాస్మిన్

Meera Jasmine: యువ రాణి పోస్టర్‌ లో మెరిసిన మీరా జాస్మిన్ 

వ్రాసిన వారు Stalin
Jun 02, 2024
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పటి జాతీయ అవార్డు గ్రహీత మీరాజాస్మిన్ మళ్లీ తెలుగు తెరపై త్వరలో అలరించనుంది. యువకథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా..హసిత్ గోలీ దర్శకత్వంలో రూపొందుతున్నస్వాగ్ అనే కొత్త చిత్రంతో రాబోతుంది. మీరాజాస్మిన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.రీతూ వర్మహీరోయిన్ గా నటిస్తోంది.దీనికి సంబంధించిన మీరా జాస్మిన్ క్యారెక్టర్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు. చాలా అందంగా కనిపిస్తున్న ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పూర్తిగా కామెడీతో నిండి వున్నసినిమా అని మేకర్స్ చెపుతున్నారు. నెలరోజుల తర్వాత,మేకర్స్ నుండి అద్భుతమైన అప్‌డేట్‌తో ఈ చిత్రం మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే శ్రీవిష్ణు హీరోగా..హసిత్ గోలీ కాంబినేషన్లో వచ్చిన రాజ రాజ చోర మంచి విజయం సాధించింది. ఈ మూవీపై కూడా మంచి అంచనాలే వున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోస్టర్ లో మీరా జాస్మిన్ స్టన్నింగ్ లుక్