LOADING...
MSVG : గుంటూరులో మెగా జోష్.. చిరు-వెంకీ మామ కాంబోతో అభిమానులకు పండగే పండగ!
గుంటూరులో మెగా జోష్.. చిరు-వెంకీ మామ కాంబోతో అభిమానులకు పండగే పండగ!

MSVG : గుంటూరులో మెగా జోష్.. చిరు-వెంకీ మామ కాంబోతో అభిమానులకు పండగే పండగ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' (MSVG) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని మూడో పాట విడుదలను ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్రత్యేకంగా భారీ ప్రమోషనల్ టూర్‌ను ప్లాన్ చేశారు. అందులో భాగంగా చిత్ర బృందం ఈరోజు ఉదయం 9 గంటలకు విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంది. అనంతరం ఉదయం 9:30 గంటలకు అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది.

Details

సాయంత్రం 3 గంటలకు రిలీజ్

తర్వాత ఉదయం 11 గంటలకు గుంటూరులో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో చిత్ర యూనిట్ పాల్గొననుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర మూడో పాటను సాయంత్రం 3 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి - వెంకటేష్ (వెంకీ మామ) కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండటంతో మెగా, నందమూరి అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై సంక్రాంతి సందడిని మరింత పెంచనుంది.

Advertisement