Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మోకాలికి సర్జరీ?
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే చిరంజీవికి సంబంధించిన ఒక కీలక ఆరోగ్య అంశం ఇప్పుడు చర్చకు వస్తోంది. చిరంజీవి ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం. ఆయన కొంతకాలంగా మోకాలి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఈ కారణంగా సరిగా నడవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసింది. అయినప్పటికీ, పండుగ సీజన్‌కు సినిమా విడుదల చేయాలన్న కట్టుబాటుతో, షూటింగ్ మొత్తం బాధను ఓర్చుకుంటూనే పూర్తి చేశారని సమాచారం.
Details
స్పందించని చిరు టీమ్
షూటింగ్ పూర్తైన అనంతరం తాజాగా ఆయన సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఈ వారంలో జరగనున్న 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ కార్యక్రమం నుంచే సినిమా ప్రమోషన్లు మరింత ఊపందుకోనున్నాయని సమాచారం. చిరంజీవి మీడియా ముందుకు వచ్చి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలను చిరంజీవి టీమ్ అధికారికంగా ఎక్కడా ప్రస్తావించడం లేదు.
Details
కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్
ఈ అంశాన్ని గోప్యంగా ఉంచుతున్న నేపథ్యంలో, దీనిపై అధికారిక ప్రకటన వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటితో కలిసి, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.