Spirit : స్పిరిట్‌లో ప్రభాస్‌కు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్?
ఈ వార్తాకథనం ఏంటి
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్'. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్‌తో పాటు సందీప్ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల 'స్పిరిట్' సినిమా షూటింగ్‌ను సందీప్ రెడ్డి వంగా ప్రారంభించారు. తొలి షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఫారిన్ ట్రిప్‌లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.
Details
సెకండాఫ్ లో 15 నిమిషాలు పాటు చిరంజీవి పాత్ర
మెగాస్టార్ చిరంజీవి 'స్పిరిట్' సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కథలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తండ్రిగా చిరంజీవి కనిపించనున్నారని, ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌లో దాదాపు 15 నిమిషాల పాటు ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. భారతదేశంలోనే అతిపెద్ద స్టార్‌లుగా గుర్తింపు పొందిన ప్రభాస్, చిరంజీవి ఒకే చిత్రంలో కలిసి కనిపించనుండటం నిజమైతే, ఇది భారీ సంచలనమేనని చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా మెగాస్టార్ చేతుల మీదుగానే జరగడం గమనార్హం. అప్పటి నుంచే 'స్పిరిట్'లో చిరంజీవి నటిస్తున్నారనే గాసిప్‌లు వినిపించాయి.
Details
అధికారిక ప్రకటన వెలువడలేదు
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే, ఈ ప్రచారానికి బలం చేకూరుతున్నట్లు కనిపిస్తోంది. ఇదివరకు 'యానిమల్' చిత్రంలో రణబీర్ కపూర్‌కు తండ్రిగా అనిల్ కపూర్‌ను స్టైలిష్‌గా ఆవిష్కరించిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు 'స్పిరిట్'లో మెగాస్టార్ చిరంజీవిని ఎలాంటి షేడ్స్‌లో చూపిస్తాడన్నది అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగా స్టార్, సూపర్ స్టార్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు కలిగే ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ మెగా-సూపర్ స్టార్ కలయికపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో చూడాల్సి ఉంది.