LOADING...
Mehreen Pirzada: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న మెహరీన్.. ఇన్‌స్టాలో అధికారిక ప్రకటన
సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న మెహరీన్.. ఇన్‌స్టాలో అధికారిక ప్రకటన

Mehreen Pirzada: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న మెహరీన్.. ఇన్‌స్టాలో అధికారిక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సినీ నటి మెహరీన్ పిర్జాదా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అర్ష్ ఔలఖ్‌తో తన వివాహం జరిగినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆదివారం కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక సాదాసీదాగా జరిగినట్లు సమాచారం. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మెహరీన్, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ దగ్గుబాటి, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఎఫ్2', 'ఎఫ్3' చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

Advertisement