సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: బోల్డ్ గా నటించడంపై వచ్చిన విమర్శలకు స్పందించిన హీరోయిన్ మెహరీన్
కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది మెహరీన్. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాల్లో మెహరీన్ కనిపించలేదు. తాజాగా సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి మెహరీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ లో కాస్త బోల్డ్ గా మెహరీన్ కనిపించింది. లిప్ లాక్ సీన్స్ ఇంకా రొమాంటిక్ సన్నివేశాల్లో మెహరీన్ నటించింది. తాజాగా ఈ సీన్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. బోల్డ్ సీన్స్ లో తాను నటించినందుకుగాను విమర్శలు రావడంతో ట్విట్టర్ వేదికగా మెహరీన్ స్పందించింది. బోల్డ్ సీన్స్ ని తాను కథలో భాగంగానే చూస్తానని, కొన్ని కథలు అలాంటి సీన్స్ ని డిమాండ్ చేస్తాయని ఆమె అన్నారు.
నార్మల్ రొమాంటిక్ సీన్ కాదంటున్న మెహరీన్
పెళ్లయిన తర్వాత ఇష్టం లేకపోయినా కూడా భర్త బలవంతం శృంగారం విషయంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారని, అలాంటి ఒకానొక సన్నివేశంలో తాను నటించానని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి సన్నివేశాన్ని నార్మల్ రొమాంటిక్ సీన్ అని చాలామంది అంటున్నారని, అది నార్మల్ సీన్ కాదని, తనను విమర్శిస్తున్న వారికి చెల్లెల్లు, కూతుర్లు ఉంటారని, వారికి సినిమాల్లో చూపించినట్లుగా జరగకూడదని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు ఒక నటిగా బెస్ట్ ఇవ్వడానికే తాను ప్రయత్నిస్తానని, అది ఎలాంటి పాత్రయినా బాగా రావాలని అనుకుంటానని మెహరీన్ ట్వీట్ చేసింది.