
తారకరత్న అంత్యక్రియల్లో అజ్ఞాతవ్యక్తి: బాలకృష్ణతో మాట్లాడుతుంటే పక్కకు తీసుకెళ్ళిన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
20రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న, చివరగా మహాశివరాత్రి రోజున శివైక్యం అయ్యారు. ఈరోజు తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. ఐతే నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం తెలుగు ఫిలిమ్ ఛాంబర్ లో ఉంచారు.
ఆ సమయంలో అభిమానులతో పాటు మతిస్థిమితం లేని వ్యక్తి తారకరత్న పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చాడు. చిరిగిన బట్టలు, చింపిరి జుట్టుతో ఉన్న ఆ వ్యక్తి, బాలకృష్ణ వైపు వేలు చూపిస్తూ ఏదో మాట్లాడాడు.
బాలకృష్ణ కూడా అతడు మాట్లాడిన దానికి తలూపుతూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకు పోలీసులు ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మతిస్థిమితం లేని వ్యక్తి | ఓపికగా సమాధానం చెప్పిన బాలయ్య బాబు
తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి |
— Sailendra Medarametla (@sailendramedar2) February 20, 2023
ఓపికగా సమాధానం చెప్పిన బాలయ్య బాబు 💔- Taraka Ratna Last Rites #RIPTarakaRatna #TarakaRatnaNoMore #TarakaRatna #NandamuriTaraka pic.twitter.com/vu6fCYfxiC