షార్ట్ ఫిలిమ్ టు సిల్వర్ స్క్రీన్: కిరణ అబ్బవరం పరిచయం చేసిన కొత్త హీరో
షార్ట్ ఫిలిమ్స్ నుండి సిల్వర్ స్క్రీన్ మీద అడుగు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు నాటకాల నుండి వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ తో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోని యంగ్ హీరోల్లో చాలామంది షార్ట్ ఫిలిమ్స్ నుండి వచ్చినవారే. విజయ్ దేవరకొండ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నవీన్ పొలిశెట్టి, కిరణ్ అబ్బవరం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అయితే తాజాగా కిరణ్ అబ్బవరం, మరోషార్ట్ ఫిలిమ్ హీరోను పరిచయం చేసాడు. తనతో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన నటుడు కుమార్ కాసారంకు తన మీటర్ సినిమాలో అవకాశం ఇచ్చాడు.
మీటర్ తర్వాత కుమార్ కాసారంకు మంచి అవకాశాలు
మీటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన కిరణ్ అబ్బవరం, షార్ట్ ఫిలిమ్ నటుడు కుమార్ కాసారంను వేదిక మీదకు ఆహ్వానించి, మీటర్ సినిమాలో కుమార్ కాసారం వేసిన పాత్ర గురించి మాట్లాడాడు. కుమార్ కాసారం ఇదివరకు ఓ బేబి, మజిలీ, కొండా వంటి చిత్రాల్లో కనిపించాడట. ఒకానొక షార్ట్ ఫిలిమ్ లో కుమార్ ని చూసి, మీటర్ లో అవకాశమిచ్చాడట దర్శకుడు రమేష్ కదురి. మీటర్ తర్వాత కుమార్ కాసారంకు మంచి అవకాశాలు వస్తున్నాయట, ఆల్రెడీ ఒక సినిమాలో హీరోగా చేసాడని, మరో మూవీ సిద్ధంగా ఉందని కిరణ్ అబ్బవరం అన్నాడు. మీటర్ సినిమా ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ అవుతోంది. అతుల్యా రవి హీరోయిన్ గా కనిపిస్తోంది.