ఖుషి రిలీజ్ డేట్: రెండు ప్రపంచాలు ఎప్పుడు కలుస్తున్నాయో చెప్పేసిన చిత్రబృందం
ఈ వార్తాకథనం ఏంటి
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఖుషి. లైగర్ రిలీజ్ కి ముందే ఈ సినిమాను మొదలెట్టాడు విజయ్.
కానీ సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ప్రస్తుతం షూటింగ్ కి సమంత రెడీగా ఉండడంతో, ఈ సినిమాను మళ్ళీ మొదలెడుతున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఖుషి సినిమా, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందో చెప్పేసారు. 2023 సెప్టెంబర్ 1వ తేదీ రోజు థియేటర్లలో ఖుషి చిత్రం సందడి చేయనుంది.
ఈ మేరకు రిలీజ్ పోస్టర్ ని వదిలింది చిత్రబృందం. ఈ పోస్టర్ లో దాదాపు సినిమాను చెప్పే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది.
ఖుషి
గీతగోవిందం సినిమాను గుర్తు చేసే విజయ్ లుక్
రెండు వేరు వేరు ప్రపంచాల్లో ఉండే పాత్రలు ఎలా కలుస్తాయో చెప్పే చిత్రంగా ఉండబోతున్నట్లు పోస్టర్ చెబుతోంది.
ఇందులో విజయ్ గెటప్ చూస్తుంటే, పక్కింటి కుర్రాడిలా ఉన్నాడు. క్యారేజీ పట్టుకుని రోజూ ఆఫీసుకు వెళ్ళే అబ్బాయిలా కనిపిస్తున్నాడు. ఆ గెటప్, లుక్.. గీతగోవిందం సినిమాలోని విజయ్ పాత్రను గుర్తు తెచ్చే విధంగా ఉంది.
ఇక సమంత చాలా అందంగా ఉంది. తను కూడా సాధారణ అమ్మాయిలానే కనిపిస్తుంది. మరి వీరిద్దరి ప్రపంచాల్లో తేడా ఏంటనేది తెలియాలంటే సినిమా నుండి మరిన్ని అప్డేట్లు రావాల్సిందే.
శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. హేషబ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖుషి సినిమా రిలీజ్ డేట్
Experience the Magic of Two Worlds Falling for Each Other ♥#Kushi in cinemas from 1st SEPTEMBER 2023 ❤️🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/C2VGk6uJPz
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023